7th Class English Worksheets as in single page image format free download

 విద్యార్ధులకు సరాసరి పాఠాలను బోధించడం కానీ పరీక్షలు నిర్వహించడం కానీ సాధ్యం కాని ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాపరిశోధన మండలి విద్యార్ధులు ఇంటివద్దనే వుండి చేసుకునేలా కృత్య పత్రాలను తయారుచేసింది. 


వాట్సప్ గ్రూపుల ద్వారానూ అనేక వెబ్ సైట్ల నుంచి పైన సూచించిన పిడిఎఫ్ రూపంలోని పుస్తకం లాగా వున్న కృత్యపత్రాల లిస్లును పొంది వున్నారు. కానీ వాటిని విద్యార్ధులకు సరఫరా చేయాలంటే ప్రింట్ తీసుకుని పరీక్షల వారీగా ఇవ్వాలి లేదా వాట్సప్ మెయిల్ లాంటి వాటిలో పంపాలి. మొత్తం పుస్తకం ఒకేసారి పంపితే విద్యార్ధులకు ఇబ్బందిగా వుంటుంది. ఎంత వరకూ పరీక్ష రాయాలో తెలియదు. కాబట్టి వీలున్నంత వరకూ కొందరు మిత్రులు టెస్టుల వారీగా పిడిఎఫ్ లుగా మార్చి పంపుతున్నారు. అయినప్పటికీ జియో ఫోన్ ల వంటి వాటిలో చూసే వారికి మొబైల్ వ్యూ చిన్నగా అనిపిస్తే జూమ్ చేసి రాసుకోవాలనుకునే వారికి అది ఇబ్బందిగానే వుండటంతో ఇమేజ్ ఫార్మాట్ లో ఈ పత్రాలు వుంటే బావుంటుంది అనిపించింది. అందుకే మొత్తం పుస్తకంలోని కృత్య పత్రాలను టెస్టు వారీగా ఇమేజ్ లుగా తయారు చేసి క్రింత లింకును పొందుపరస్తున్నాను. ఇది ఉపాధ్యాయులు కానీ విద్యార్ధులు కానీ ఎప్పటికప్పుడు డౌన్ లోడ్ చేసుకుని వాడుకునేందుకు అనువుగా వుంటుంది.


ఈ లోగా అసలు పుస్తకం తయారీ, కృత్యపత్రాలు ఇచ్చిన.  విధానం అర్దం చేసుకుంటే వాటిని వినియోగించుకోవడం మరింత సులభం అవుతుంది ఈ షీట్స్ ని ప్రధానంగా రెండు భాగాలుగా అర్దం చేసుకోవాలి. 

మొదటిది : 18 worksheets  ఎడవ తరగతి బేసిక్స్ అర్ధం అయ్యేలాగా ఇచ్చిన వర్కుషీట్సుఈ క్రమంలో వుంటాయి. ఈ ఇండెక్సు పేజీలోని నంబర్ల వారీగా ప్రతి టెస్టుకు వేర్వేరు ఫోల్డర్లలో వుంటాయి. 


రెండవ లెవల్ కు సంభందించినవి భాషావినియోగానికి సంభందించిన వర్కుషీట్లు వాటిని నంబర్ల వారీగా ఫోల్డర్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.







Download Pagewise image worksheets from here

Comments