విద్యార్ధులకు సరాసరి పాఠాలను బోధించడం కానీ పరీక్షలు నిర్వహించడం కానీ సాధ్యం కాని ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాపరిశోధన మండలి విద్యార్ధులు ఇంటివద్దనే వుండి చేసుకునేలా కృత్య పత్రాలను తయారుచేసింది.
వాట్సప్ గ్రూపుల ద్వారానూ అనేక వెబ్ సైట్ల నుంచి పైన సూచించిన పిడిఎఫ్ రూపంలోని పుస్తకం లాగా వున్న కృత్యపత్రాల లిస్లును పొంది వున్నారు. కానీ వాటిని విద్యార్ధులకు సరఫరా చేయాలంటే ప్రింట్ తీసుకుని పరీక్షల వారీగా ఇవ్వాలి లేదా వాట్సప్ మెయిల్ లాంటి వాటిలో పంపాలి. మొత్తం పుస్తకం ఒకేసారి పంపితే విద్యార్ధులకు ఇబ్బందిగా వుంటుంది. ఎంత వరకూ పరీక్ష రాయాలో తెలియదు. కాబట్టి వీలున్నంత వరకూ కొందరు మిత్రులు టెస్టుల వారీగా పిడిఎఫ్ లుగా మార్చి పంపుతున్నారు. అయినప్పటికీ జియో ఫోన్ ల వంటి వాటిలో చూసే వారికి మొబైల్ వ్యూ చిన్నగా అనిపిస్తే జూమ్ చేసి రాసుకోవాలనుకునే వారికి అది ఇబ్బందిగానే వుండటంతో ఇమేజ్ ఫార్మాట్ లో ఈ పత్రాలు వుంటే బావుంటుంది అనిపించింది. అందుకే మొత్తం పుస్తకంలోని కృత్య పత్రాలను టెస్టు వారీగా ఇమేజ్ లుగా తయారు చేసి క్రింత లింకును పొందుపరస్తున్నాను. ఇది ఉపాధ్యాయులు కానీ విద్యార్ధులు కానీ ఎప్పటికప్పుడు డౌన్ లోడ్ చేసుకుని వాడుకునేందుకు అనువుగా వుంటుంది.
ఈ లోగా అసలు పుస్తకం తయారీ, కృత్యపత్రాలు ఇచ్చిన. విధానం అర్దం చేసుకుంటే వాటిని వినియోగించుకోవడం మరింత సులభం అవుతుంది ఈ షీట్స్ ని ప్రధానంగా రెండు భాగాలుగా అర్దం చేసుకోవాలి.
మొదటిది : గత సంవత్సరం విద్యార్ధులు చదువుకున్న 8వ తరగతి ఇంగ్లీషులోని 8 యూనిట్ల పాఠాల నుంచి 18 వర్క్ షీట్స్ మొత్తం ఒక సెట్ గా వుంటుంది. . అవి ఈ క్రమంలో ఉంటాయి.
ఇకపోతే 2020-2021 విద్యాసంవత్సరానికి గానూ లెవల్ 2 అనే పేరుతో తొమ్మిదవ తరగతి పాఠాలు టివిలోనూ, యూట్యూబు లోనూ పిల్లలు విన్న తర్వాత ఒకసారి చదువుకుని అర్దం అయిన అంశాలను పరిశీలించుకునేందుకు చేయవలసిన కృత్య పత్రాలు వేరుగా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా నంబర్ల వారిగా ఈ లింకులో పొందుపరిచాము. ఈ పత్రాలను పూర్తి చేస్తూనే తొమ్మిదవ తరగతి స్థాయిలో నేర్చుకోవలసిన మేజర్ మైనర్ డిస్కోర్సులు కవర్ అయ్యే లాగా ఈ పత్రాలను రూపొందించారు కావునా ఏ సందర్భంలో ఏ కృత్య పత్రం అనుకూలమో ఉపాధ్యాయులు అంచనా వేసుకుంటూ తగిన వాటిని డౌన్ లోడ్ చేసుకుని పంపడం వల్ల విద్యార్ధులు సులభంగా వాటిని పూర్తి చేసి పంపగలుగుతారు. లేదా విద్యార్ధులే ఆయా పాఠాల తర్వాత స్వయంగా అర్దం చేసుకుని కావలసిన పత్రం దింపుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోగలిగితే మరీ మంచిది.
ఈ క్రింది లింకు నుంచి ఇమేజ్ రూపం లోని 9వ తరగతి వర్కు షీట్లను దింపుకోవచ్చు.
Download work sheets from here
Comments
Post a Comment