ప్రాధమిక విద్యను పూర్తిచేసుకుని కొత్తగా ఉన్నత పాఠశాలలోకి అడుగుపెట్టే 6వ తరగతి విద్యార్ధులు బడికి కొత్త బడికి వాళ్ళు కూడా కొత్త, అదే ప్రాధమికోన్నత పాఠశాలల్లో అయితే తెలిసిన టీచర్లు, వారికి తెలిసిన విద్యార్ధులు వుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పరభాష టిపి, విడియో పాఠాల ద్వారా నేర్చుకోవడం పిల్లలకు కొంత ఇబ్బందే అయినప్పటికీ వీలున్నంతలో చదువుకున్న తల్లిదండ్రులు, అన్నలు అక్కలు కూడా చేసే సహకారం ద్వారా విద్యాసంవత్సరం పూర్తిగా నష్టపోకుండా కొంత మేర ఆంగ్లం నేర్చేకునే ప్రయత్నం చేసేందుకు డిజిటల్ పాఠాలకు అదనంగా ఈకృత్యపత్రాలను వినియోగించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ తయారుచేసింది.
ఈ పత్రాలు రెండు మిగిలిన అన్ని తరగతుల మాదిరి గానే రెండు లెవల్స్ లో తయారు చేయడం జరిగింది.Level 1 : మొదటి స్థాయిలో వాళ్ళు గత సంవత్సరాలలో చదివిన తరగతి నుంచి పాఠాల ఆధారంగా కృత్యాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. 6వ తరగతి వారికి 4వ తరగతి పాఠ్యాంశాలను ఆధారంగా చేసుకున్న పత్రాలను ప్రాధమిక స్థాయిలో ఇచ్చారు అందువల్ల టీచర్ నుంచి పాఠం గతంలో వినివున్నారు కాబట్టి ఇప్పుడు కొంత వర్క చేయగల అవకాశం వుంటుంది. దానిలోని పత్రాలు ఈ వరుసలో 18 వున్నాయి.
Level 2 : ఇక రెండవ స్థాయిలో 2020-21 విద్యాసంవత్సరానికి సంభందించిన 6వ తరగతి పాఠాలనుంచి కృత్య పత్రాలను ఇవ్వడం జరిగింది. వీటిని టివి లేదా యూట్యూబ్ లో పాఠాన్ని విన్న తర్వాత చేయడం వల్ల మంచి ప్రయోజనం వుంటుంది. దీనిలో లాంగ్వెజ్ కాంటెంట్ కూడా కవర్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇప్పటికే పిడిఎఫ్ గా మొత్త పుస్తకం డౌన్ లోడ్ చేసుకున్ని వున్నప్పటికి పిల్లలు ఎంతవరకూ వర్క్ చేయాలో తెలియాలి అంటే ఆ పరీక్ష వరకూ మాత్రమే పంపడం బావుంటుంది. అది కూడా పిడిఎఫ్ పార్మాట్ లో పంపితే అది జియో ఫోన్ వంటి చిన్న పోన్ లలో ఓపెన్ కాదు.పైగా పిడిఎఫ్ అయితే జూమ్ చేసి పరిశీలనగా చూడటం కష్టం అవుతుంది. అందుకే మీకు ఈ లింకు నుంచి ఏ పేజీకి ఆ పేజీ ఇమేజ్ లుగా తయారు చేసిన వర్క్ షీట్లను వాటి నంబరు ఆధారంగా వేర్వేరు ఫోల్డర్లలలో వుంచి అందుబాటులోకి తెస్తున్నాం.
Comments
Post a Comment